Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభాకాంక్షలు తెలిపింది. మార్చి 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ తరుణంలోనే మహిళా దినోత్సవం సందర్భంగా సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో ఈనెల 8న రూ.750 కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.