Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఫిబ్రవరి 8న బుచ్చిబాబును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాస్పోర్టు అప్పజెప్పాలని, రూ.2లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలిపింది.