Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. దీంతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది. ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదని ఓజీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ కేవీ ప్రదీప్ తెలిపారు.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీ. ప్రయాణం. ఎయిర్ కండీషన్డ్ ఇంటర్సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు మహానగరాలైన హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగర పరిధిలో తిరుగుతాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇవి పర్యావరణానికి తోడ్పటమే కాకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందిస్తాయి. ఈ క్రమంలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, విస్తరణ, కార్యకలాపాల కోసం టీఎస్ఆర్టీసీ జంటనగరాల్లో ఐదు డిపోలను కేటాయించింది. దిల్సుఖ్ నగర్, హయత్నగర్, జీడిమెట్ల, మియాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లలో డిపోలను ఏర్పాటు చేయనుంది.