Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గోన్నారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దిందని అన్నారు.
ఈ తరుణంలోనే మహిళలు ఎప్పుడూ వంట గదిలోనే ఉండాలన్న రోజులు పోవాలని, దాని కోసం ప్రతి మహిళ ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సమయం పని చేస్తున్నారని తెలిపారు. తన తల్లి తనను ఆ కాలంలో పట్టుబట్టి మరీ ఇంగ్లీష్ మీడియం చదివించిందని, అందుకు తాను మానుకొండూర్ గడ్డ మీద నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లోని మహిళలకు వడ్డీ రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో రూ.18 వేల కోట్ల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మహిళలు అందించిందని తెలియజేశారు. పేద కుటుంబాలకు కచ్ఛితంగా ఇల్లు కట్టుకోవడం కోసం రూ.3 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు.