Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగర శివారులో ఇటీవల జరిగిన నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల జాబితాలో యువతి పేరును కూడా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు చేర్చారు. యువతి కోసమే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసినట్లు నిర్ధారించారు. హరిహరకృష్ణ చెప్పిన వివరాల ఆధారంగా యువతిపై కేసు నమోదు చేశారు. అంతే కాకుండా ఏ2గా హసన్, ఏ3గా యువతి పేరును చేసి ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
ఈ తరుణంలో సోమవారం డీసీపీ మీడియాతో మాట్లాడుతూ నవీన్‌ను హరిహరకృష్ణ ఒక్కడే హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని స్నేహితుడు హసన్‌కు తెలిపారు. హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, విశాఖ వెళ్లాడు. గత నెల 24న తిరిగి వచ్చి యువతితోపాటు స్నేహితుడు హసన్‌ను కలిశాడు. వారిద్దర్నీ నవీన్‌ను హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లాడు అని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. సీన్‌రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా బయటకి తీసుకెళ్ల దర్యాప్తు సమయంలో చెప్పిన ఆధారాలకు అనుగుణంగా ప్రశ్నిస్తున్నారు.