Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డెవినె (16), దిశా కసాత్ (0)ఒకే ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఇషాక్ డెవినే వికెట్ తీసి ముంబై ఇండియన్స్‌కు బ్రేక్ ఇచ్చింది. దాంతో, 39 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. మంధాన 23 పరుగులతో, ఎలిసే పెర్రీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లకు ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 43 రన్స్ చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీకి. ఓపెనర్లు స్మృతి మంధాన, డెవినే శుభారంభం ఇచ్చారు. ఇసీ వాంగ్ వేసిన నాలుగో ఓవర్లో మంధాన చెలరేగింది. ఏకంగా మూడు బౌండీలు బాదింది. హేలీ మ్యాథ్యూస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మంధాన ఫోర్ డెవినే, సిక్స్ కొట్టడంతో 11 రన్స్ వచ్చాయి.