Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
‘పితామగన్’, ‘గజేంద్ర’, ‘లవ్లీ’, ‘లూటీ’ వంటి పలు చిత్రాలకు నిర్మాత వీఏ దురై. బాలా దర్శకత్వంలోని ‘పితామగన్’ ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో సూర్య, విక్రం నటించిన విషయం తెలిసిందే. జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ నిర్మాత అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యానికి డబ్బుల్లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన ఆయన ఆదివారం ఓ వీడియోను కూడా విడుదల చేశారు. మధుమేహం కారణంగా కాలికి శస్త్రచికిత్స చేయాలని, వైద్య ఖర్చులకు కూడా డబ్బుల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో చూసిన సూర్య వెంటనే స్పందించారు. వైద్య ఖర్చులకు రూ.2 లక్షలు అందించారు. ఇంకా పలువురు నటులు కూడా తమవంతుగా నగదు ఇస్తున్నారు.