Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షిల్లాంగ్
మేఘాలయలో మంగళవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా మరోమారు కాన్రాడ్ కె సంగ్మా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధినేత అయిన సంగ్మా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 26 సీట్లను గెలుచుకుని మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వంలో ఎన్పీపీ 8, యూడీపీ 2, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ చెరో కేబినెట్ బెర్తులను దక్కించుకున్నాయి. కొత్తగా ఎన్నికైన 58 మంది ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీలో ప్రమాణం చేశారు. 60 సీట్లలో ఒకచోట ఎన్నిక నిలిచిపోగా తిమోతి డి షిరా ప్రొటెం స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు భాజపా నాయకులు హాజరుకానున్నారు.