Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాజస్థాన్లోని చురూలో ఓ వింత శిశువు జన్మించింది. రతన్గఢ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది. పుట్టిన 20 నిమిషాల తర్వాత నవజాత శిశువు మరణించిందని వైద్యులు తెలిపారు. హజారీ సింగ్ అనే మహిళ ప్రసవ నొప్పులతో ఆదివారం రాత్రి గంగారామ్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించగా అందులో వింత శిశువు కనిపించిందని వైద్యులు తెలిపారు. ‘‘నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. అలాగే రెండు గుండెలు, వెన్నెముకలు ఉన్నాయి. పుట్టిన కొన్ని నిమిషాల తర్వాత ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగానే ఉంది’’ అని వైద్యులు పేర్కొన్నారు.