Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ పూనమ్ కౌర్ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తరచూ ట్రోలింగ్‌కు గురవుతుంటుంది.
ఈ తరుణంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన మతం ద్వారా తనను వేరు చేసి చూస్తున్నారంటూ నేను తెలంగాణలోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. కానీ నేను పంజాబీని అని, సిక్కు అని మతం పేరుతో దూరం చేస్తున్నారు. నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి. మతం పేరుతో నన్ను వెలివేయకండి. నేను తెలంగాణ బిడ్డనే అంటూ పూనమ్ తనదైన దు:ఖాన్ని పంచుకున్నారు.