Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షిల్లాంగ్
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధినేత కాన్రాడ్ కె. సంగ్మా వరుసగా రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహన్ సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు. సంగ్మాతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఎన్పీపీ పార్టీకి చెందిన ఏడుగురు, యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు, హెచ్ఎస్పీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.