Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుజరాత్
గుజరాత్ తీరంలో సంచరిస్తున్న ఓ ఇరానియన్ బోటును పోలీసులు పట్టుకున్నారు. ఇండియన్ కోస్టు గార్డు, గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఆ ఆపరేషన్ నిర్వహించారు. ఆ బోటు నుంచి సుమారు 425 కోట్ల విలువైన 61 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి ఈ ఆపరేషన్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నార్కోటిక్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు దాడి చేశామని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు వెల్లడించారు. ఓఖా పోర్టుకు కొన్ని వందల నాటికల్ మైళ్ల దూరంలో ఓ ఇరానియన్ బోటు సంచరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ బోటు కదలికలపై అనుమానం రావడంతో.. కోస్టు గార్డు పోలీసులు దాన్ని వెంబడించినట్లు చెప్పారు. ఆ బోటులో 61 కేజీల నార్కోటిక్స్‌ను సీజ్ చేశారు. మొత్తం అయిదు మంది ఇరానియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ బోటును ఓఖా పోర్టుకు తీసుకువచ్చారు. ఆ డ్రగ్స్‌లో ఏం ఉన్నదన్న విషయాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ తేల్చనున్నది. నాలుగు నెలల క్రితం కూడా ఓ బోటును ఇలాగే పట్టుకున్నారు.