Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అనంతరం తొర్రూరు పట్టణ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో కేటీఆర్ సమీక్షించనున్నారు. ఆ తర్వాత 20 వేల మంది మహిళలతో భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడనున్నారు. ఈ తరుణంలోనే మహిళా దినోత్సవ కానుకగా రూ. 750 కోట్ల వడ్డీలేని రుణాలను చెక్కుల రూపంలో మహిళలకు అందజేయనున్నారు. అలాగే కేటీఆర్ డ్వాక్రా మహిళలకు అభయ హస్తం డబ్బులు అందించనున్నారు.