Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోహిమా
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్డీపీపీ నేత నెఫియు రియా మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది ఐదోసారి. ముఖ్యమంత్రి నెఫియు రియాతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా టి.ఆర్.జెలియాంగ్, యాన్యుంగో పైటన్ ప్రమాణస్వీకారం చేశారు.
కోహిమాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, నాగాలాండ్ గవర్నర్ ల గణేషణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తదితరులు పాల్గొన్నారు.