Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగర్ కర్నూలు
జిల్లాలోని మన్ననూరు గురుకులంలో దారుణం జరిగింది. క్లాస్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని నిఖిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో నిఖిత ఘర్షణ పడినట్లు సమాచారం.
ఈ క్రమంలో విద్యార్థిని మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మానసిక వేదనే నిఖిత సూసైడ్‌కు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కొట్టి చంపారని నిఖిత తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో మన్ననూరు గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.