Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
భారత వైమానిక దళం ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళలు నేరుగా యుద్ధక్షేత్రంలో విధులు నిర్వర్తించే అవకాశాన్ని ఇచ్చింది. ఈ తరుణంలో గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామకి పశ్చిమ సెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్ కాంబాట్ యూనిట్లో కమాండ్ బాధ్యతలు అప్పగించింది. రణరంగంలో నాయకత్వ బాధ్యతను మహిళకు అప్పగించడం ఇదే తొలిసారి అవ్వడం విశేషం.
అయితే ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా భారత వాయుసేనలోకి అడుగుపెట్టారు. ఆమెకు 2,800 గంటలు హెలికాప్టర్ నడిపిన అనుభవం ఉంది. పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా వ్యవహరించారు. వాయుసేనలో గ్రూప్ కెప్టెన్ అంటే ఆర్మీలో కల్నల్‌తో సమానం. ప్రస్తుతం ఆమె ఫ్రంట్‌లైన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి మెడికల్ విభాగం దాటి ఆర్మీ కూడా మహిళలకు కమాండింగ్ బాధ్యతలు అప్పగిస్తోంది.