Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రంగారెడ్డి
మహిళలు ఆత్మ విశ్వాసంతో ముందుకుసాగాలని మహిళ కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. దీనిలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ తరుణంలో సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆత్మ విశ్వాసంతో ముందుకొస్తే అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుందని, మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం షీటీం(లను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. మహిళ కమిషన్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం కోసం 181 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని, అంతే కాకుండా ప్రతి మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
రోజు రోజుకు సైబర్ క్రైం పెరుగుతుందని ముఖ పరిచయాలు లేని వ్యక్తులకు తమ వ్యక్తి గత వివరాలను పంపించవద్దని సూచించారు. ప్రతి ముగ్గురు మహిళలో ఒక మహిళా వేధింపులకు గురవుతునన్నారని తెలిపారు. మహిళలు విద్య, ఉద్యోగ పరంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి లక్ష్మి కందకట్ల, కళాశాల డైరెక్టర్ రోహిత్ కందకట్ల, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయలత, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్ఆర్ చందన, ఏవో రవికిరణ్‌రెడ్డి, వాణి, డీన్స్,హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.