Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళ్ ఫిల్మ్ హీరోయిన్ అనికా విక్రమన్‌ను తన బాయ్ ఫ్రెండ్ దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ముఖంపై ఉన్న గాయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది. బాయ్‌ఫ్రెండ్‌ను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. అనూప్ అనే వ్యక్తితో అనికా గత కొన్ని రోజుల ప్రేమాయణం నడిపిస్తోంది. గతంలో తనని అతడు ఒకసారి కొట్టాడు. అప్పుడు అతడు క్షమించమని కాళ్లపై పడడంతో వదిలేశానని, ఇప్పుడు మళ్లీ అదే తప్పు అతడు చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. విశమ్ కరణ్ అనే సినిమాలో ఆమె నటించింది.