Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కరీంనగర్ మానేరు వాగులో స్నానాలు చేసేందుకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. సొంతంగా రూ.2లక్షల చొప్పున అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
హోలీ పండుగ రోజు పిల్లలు మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు, అధికారులను మంత్రి ఆదేశించారు. కరీంనగర్‌లోని మానేరు వాగులో రివర్ ఫ్రంట్ కోసం తీసిన గుంతలో స్నానాలు చేసేందుకు వెళ్లి ఈత రాక ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులంతా ఏపీలో ఒంగోలు జిల్లాకు చెందిన వారు కాగా.. మృతుల తల్లిదండ్రులు కరీంనగర్‌కు వలసవచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.