Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 19న విశాఖలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను ఈ నెల 10 నుంచి విక్రయించనున్నారు. ఆ రోజున ఆన్లైన్లో విక్రయించనుండగా, 13న ఆఫ్‌లైన్‌లో విక్రయించనున్నట్టు ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి ఎస్.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఆఫ్‌లైన్‌లో మూడు కేంద్రాల్లో టికెట్లు విక్రయిస్తామని, అయితే ఎక్కడెక్కడ అనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పేటీఎంలోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ టికెట్ ధరలు వరుసగా.. రూ. 600, రూ.1500, రూ. 2 వేలు, రూ. 3 వేలు, రూ. 3,500, రూ. 6 వేలుగా నిర్ణయించారు.