Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈజిప్టులో రాజధాని కైరోలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర కైరోలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్తుండగా కల్యూబ్ నగరంలోని స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు అధికారులు చెప్పారు. ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలికి కనీసం 20 అంబులెన్స్‌లను పంపించామని, క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించామన్నారు.