Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. లిక్కర్ స్కామ్‌లో తాను చేసింది ఏమీ లేదని, తాను దేనికీ భయపడబోనని ఆమె తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నేను చేసింది ఏం లేదు. విచారణకు పూర్తిగా సహకరిస్తా. నేను దేనికీ భయపడను. అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరికి వెళ్తా.. అంటూ ఆమె తెలిపారు. అలాగే.. 'లిక్కర్ నేను ఫోన్లు ధ్వంసం చేయలేదు. అడిగితే ఫోన్లు కూడా ఇస్తా. గతంలో ఈ స్కామ్‌కు సంబంధించి ఆరు గంటలపాటు సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చా' అని ఆమె వివరించారు. బీజేపీ టార్గెట్ తాను కాదని, కేసీఆర్ అని ఆమె తెలిపారు. జైలుకు పంపిస్తే తానేమీ చేయలేనని, ఇందులో తన పాత్రేమీ లేదని ఆమె మరోసారి స్పష్టం చేశారామె. ఇక నోటీసుల పరిణామంపై ఆమె సాయంత్రంలోగా మరోసారి మీడియా ముందుకు రావొచ్చని తెలుస్తోంది.