Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు బీజేపీ అధిష్ఠాన వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి ప్రముఖ నాయకులు వరుసగా వైదొలుగుతున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ ఐటీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ సీటీఆర్ నిర్మల్‌కుమార్ అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ సమాచార సాంకేతిక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన దిలీప్ కన్నన్.... అన్నామలైపై పలు ఆరోపణలు గుప్పించి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. పార్టీ కోసం అలుపెరుగక పనిచేస్తున్న నేతలపై అన్నామలై నిఘా వేశారని ఆయన ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో దిలీప్కన్నన్ మంగళవారం అన్నాడీఎంకేలో చేరారు. రాష్ట్ర బీజేపీలో తగిన గుర్తింపు రాలేదంటూ ఇద్దరు ప్రముఖులు పార్టీ నుంచి వైదొలగడం రాజకీయాల్లో కలకలం ఏర్పరచింది.