Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి పోస్టులు (30) భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 24 పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో, మరో ఆరింటిన రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ నెల 17 నుంచి హైకోర్టు వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 6 చివరి తేదీగా పేర్కొన్నారు. పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 24న కంప్యూటర్ ఆధారిత స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) ఎస్.కమలాకర్‌రెడ్డి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు.