Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం గవర్నర్ ఎస్ఎన్ ఆర్య ఆయనతో ప్రమాణ స్వీకరం చేయించారు. మాణిక్ తో పాటు 8 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలిచి మరోసారి అధికారం నిలబెట్టుకుంది.