Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా నీటిపై దించారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. నేవీకి చెందిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) రోజువారీ శిక్షణలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు నేవీ అధికారులు తెలిపారు.
దీంతో హెలికాప్టర్‌ను ముంబయి తీరంలో అత్యవసరంగా నీటిపై ల్యాండ్ చేసినట్లు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందగానే రంగంలోకి దిగిన అధికారులు పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా వారిని కాపాడారని నౌకాదళ అధికార ప్రతినిధి ట్విటర్ వేధికగా వెల్లడించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.