Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మేరఠ్
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా వ్యక్తిగత సహాయకుడు సందీప్ సింగ్‌పై వేధింపుల కేసు నమోదయ్యింది. తన కుమార్తెను చంపుతానని సందీప్ బెదిరించినట్లు బిగ్‌బాస్ ఫేమ్, కాంగ్రెస్ నేత అర్చనా గౌతమ్ తండ్రి ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రియాంకా గాంధీ అర్చనాను కలవాలని అనుకుంటున్నారని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరిగే పార్టీ ప్లీనరీకి రావాలని ఆమెకు సందీప్ సింగ్ తెలిపాడు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన అర్చనతో సందీప్ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆమెను చంపేస్తానని బెదిరించాడు అని మేరఠ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో అర్చనా గౌతమ్ తండ్రి గౌతమ్ బుద్ధా తెలిపాడు. అంతేకాకుండా తన కుమార్తెను కులం పేరుతో దూషించాడని ఆరోపింస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రియాంకా గాంధీ వద్ద పనిచేసే సందీప్ సింగ్ అర్చనా గౌతమ్‌ను బెదిరించినట్లు ఫిర్యాదు అందిందని మేరఠ్ ఎస్ఎస్పీ రోహిత్ సింగ్ సాజ్వాన్ వెల్లడించారు. నిందితుడిపై ఐపీసీలోని పలు సెక్షన్లలతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కిందా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.