Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీమ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. నాలుగు వికెట్లు మాత్రమే తీసిన అశ్విన్ నాలుగు ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయాడు. ఈ క్రమంలో అశ్విన్, అండర్సన్ ఇద్దరూ 859 ర్యాంకింగ్ పాయింట్లతో సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. భారత్‌తో రెండు, మూడో టెస్టులు ఆడకపోవడంతో వెనుకబడిన కమ్మిన్స్ ప్రస్తుతం 849 ర్యాంకింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
అంతే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వారానికి ఒకసారి ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ వారం కొత్త జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో సౌతాఫ్రికా బౌలర్ కాగీసో రబడా 807 ర్యాంకింగ్ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్‌లో విజృంభిస్తున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-10లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఆయన 9వ స్థానంలో ఉన్నాడు.