Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హిమాచల్ ప్రదేశ్
సిమ్లా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చౌపాల్ తహసీల్ నెర్వా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఐదుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు నెర్వా గ్రామానికి వెళుతుండగా లోయలో పడిపోయిందని, నెర్వాకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని సిమ్లా ఎస్పీ సంజీవ్ గాంధీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.