Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
న్యాయశాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 30 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి అమరావతిలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని హైకోర్టు రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 24 ఖాళీలు, బదిలీల ద్వారా మరో 6 ఖాళీల్ని భర్తీ చేయనున్నట్టు తెలిపారు.