Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా రూపొందించిన శాటిలైట్‌ను త్వరలో లాంచ్ చేయనున్నారు. దీని కోసం ఆ ఉపగ్రహాన్ని అమెరికా యుద్ధ విమానంలో భారత్‌కు తరలించారు. నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ ఉపగ్రహాన్ని సీ-17 విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరుకు బుధవారం చేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా భూమి క్రస్ట్, ఉపరితలం, మంచు ప్రాంతాల్లో మార్పులను పరిశీలించేందుకు అమెరికా, భారత్ కలిసి సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టనున్నాయి.
హిమాలయాల్లోని హిమానీనదాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల పరిశీలన, పర్యవేక్షణకు ఈ శాటిలైట్‌ను ఇస్రో వినియోగిస్తుంది. ఎస్యూవీ వాహనం అంత పరిమాణం, సుమారు 2,800 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహంలో ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్, సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) వంటి పరికరాలు ఉన్నాయి. ఎస్-బ్యాండ్, ఎస్ఏఆర్ ద్వారా మేఘాలు, దట్టమైన అడవుల పై నుంచి కూడా కింద ఉన్న వాటిని స్పష్టంగా చూడవచ్చు. అధిక రిజల్యూషన్ చిత్రాలను రూపొందించవచ్చు.