Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మార్కెట్లోకి మరో కొత్త ఇ-బైక్ అందుబాటులోకి వచ్చింది. టాటా గ్రూప్‌నకు చెందిన స్ట్రైడర్ కంపెనీ జీటా ఇ-బైక్‌ను నూతనంగా లాంచ్ చేసింది. దీని అసలు ధర రూ.31,999. పరిమిత కాలపు ఆఫర్ కింద 20% డిస్కౌంట్‌తో రూ.25,599కే ఇ-బైక్ లభిస్తోంది. ఈ ఇ-బైక్ కంపెనీ వెబ్సైట్లో ఆకుపచ్చ, బూడిద రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. స్ట్రైడర్ జీటాలో 36వి, 250 డబ్ల్యూ బీఎల్డీసీ రేర్ హబ్ మోటార్ అమర్చారు. ఈ ఇ-బైక్ ఫ్రేమ్ లోపల లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. దీన్ని 3 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. సింగిల్ ఛార్జ్‌తో హైబ్రిడ్ రైడ్ మోడ్‌లో (పెడల్ సాయంతో) 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. పెడల్ సాయంతో లేకుండా గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఒక కిలోమీటర్ ప్రయాణానికి 10 పైసలు ఖర్చవుతుందని పేర్కొంది. ఇ-బైక్ కావాలనుకునేవారు స్ట్రైడర్ వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. మీ ప్రాంతానికి డెలివరీ ఉందో లేదో తెలుసుకోవచ్చు.