Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె వికలాంగురాలు భార్య ఓ తండ్రి రైలు పట్టాలపై ప్రాణాలు విడిచాడు. మల్లాపూర్ ప్రాంతానికి చెందిన మల్లేశ్ చారి తన కుమార్తె ఉమారాణితో కలిసి నివాసం ఉంటున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం అనారోగ్యంతో మల్లేశ్చారి భార్య కన్నుమూసింది.
అప్పటి నుంచి వికలాంగురాలు తన కుమార్తెను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మరణం తర్వాత ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, కుమార్తెను పోషించే శక్తి లేక, ఆమెకు సేవ చేయలేక బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ తరుణంలో ఇవాళ చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి కుమార్తెతో సహా మల్లేశ్చారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.