Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత నీలంరాజు లక్ష్మీప్రసాద్ (96) కన్నుమూశారు. విజయనగర్ కాలనీలోని స్వగృహంలో మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. లక్ష్మీప్రసాద్ తండ్రి నీలంరాజు వేంకట శేషయ్యటంగుటూరు ప్రకాశం పంతులు వ్యక్తిగత కార్యదర్శిగా, ఆంధ్రప్రభ ఎడిటర్‌గా సేవలందించారు.
మద్రా్‌సలో ఎంఏ ఆర్థికశాస్త్రం అభ్యసించిన లక్ష్మీప్రసాద్ ఉమ్మడి ఏపీ ఆర్థిక, గణాంక శాఖ డైరెక్టరుగా 1986లో పదవీ విరమణ చేశారు. ‘ఆలోకన’, ‘సత్కథా సంపుటి’, ‘పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?’, ‘గరుడయానం’, ‘దివ్యానుభవమూర్తులు’ తదితర 45కుపైగా ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు. ఆకాశవాణిలో ‘భావన’ పేరుతో ప్రసంగాలు చేశారు. కొద్దిరోజులుగా ఆయన ‘ఈ మది నెమ్మదించేనా?’ అనే పుస్తకం రాస్తున్నారు. తుదిశ్వాస విడవడానికి కొద్దిసేపటి ముందు కూడా ఆయన ఆ పుస్తక రచనలో నిమగ్నమైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. లక్ష్మీప్రసాద్ భార్య దమయంతి పదేళ్ల క్రితం కన్నుమూశారు.