Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరిక
అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఇంట్లో పని ఉందని, సాయం చేయాలంటూ పొరుగింటి బాలుడి (13)కి వల విసిరింది ఓ మహిళ. అతడిపై ఉన్న వ్యామోహంతో పదే పదే ఇంటికి పిలిచి శారీరక సంబంధం ఏర్పర్చుకుంది. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బాలుడిని ఆమె కోరింది. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలెగులోకి వచ్చింది.
ఈ ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి ఆండ్రియా సెరానో (31)ను అరెస్ట్ చేశారు. మైనర్పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు మోపారు. తమ మధ్య లైంగిక సంబంధం ఉన్న మాట వాస్తవమేనని కోర్టులో ఆండ్రియా అంగీకరించింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ బాలుడే తండ్రి అని చెప్పింది. మహిళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆమెను విడుదల చేయడానికే మొగ్గు చూపారు. 70 వేల డాలర్ల (రూ.57 లక్షలు) పూచీకత్తుతో విడుదలకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరిన తరుణంలో కేసును ముగించేందుకే కోర్టు ప్రయత్నించింది. అయితే, పుట్టబోయే బిడ్డకు ఆ బాలుణ్నే తండ్రిగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది.