Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాద్రికొత్తగూడెం
నేడు ఓకే ముహూర్తంలో ఒకే పెళ్లి మండపంపై ఇద్దరు వధువులను ఓ గిరిజన యువకుడు పెళ్లాడబోతున్నాడు. మూడేళ్ల కిందట ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి ఇంటికి తెచ్చుకున్న యువకుడు ఇరుపక్షాల పెద్దల అంగీకారంతో వారిని గిరిజన సంప్రదాయంతో వివాహం చేసుకోబోతున్నాడు.
చర్ల మండలం మారుమూల ఎర్రబోరుకు చెందిన మడివి సత్తిబాబు డిగ్రీ వరకు చదివి ఆపేశాడు. ఇదే మండలం దోశిల్లపల్లికి చెందిన స్వప్న కుమారిని ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ప్రేమించాడు. అదే తరుణంలో వరుసకు మరదలైన కుర్నపల్లికి చెందిన సునీతను సైతం ఇష్టపడ్డాడు. అనంతరం మూడేళ్లుగా ఇద్దరితో సహజీవనం సాగించాడు. దీంతో స్వప్నకు పాప, సునీతకు బాబు పుట్టారు. అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లిచేసుకోమని కోరగా ఇద్దరినీ అమితంగా ప్రేమించానని ఇద్దరినీ పెళ్లాడతానని ఇరుపక్షాల దగ్గరా ఒప్పించుకున్నాడు. మూడు గ్రామాల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీ ద్వారా ముగ్గురి ఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ల ఇష్టప్రకారమే పెళ్లికి నిశ్చయించారు.