Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా బీఆర్ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దేశపతి శ్రీనివాస్, కే.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను పార్టీ అధినే కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ సూచనమేరకు గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ సహా పలువురు మంత్రులు, పార్టీ నాయకులు పాల్గొనున్నారు.
ఈ నెల 14న నామపత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మార్చి 23న ఎన్నికకు పోలింగ్ జరుగనుంది. ఆరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజు ఓట్లు లెక్కించనున్నారు.