Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కొచ్చి
బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియా ఉద్యోగి సట్టుబడ్డాడు. ఈ క్రమంలో అతన్ని కేరళలోని కొచ్చి ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. వయనాడ్కు చెందిన షఫీ అనే వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1487 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బహ్రెయిన్-కోజికోడ్-కొచ్చి మధ్య ప్రయాణించే విమానంలో షఫీ బంగారాన్ని తీసుకువస్తున్నట్లు గుర్తించారు. బంగారాన్ని చేతులకు చుట్టుకుని, దాని మీద నుంచి షర్ట్ వేసుకుని గ్రీన్ ఛానల్ ద్వారా దాటే ప్రయత్నం చేసిన షఫీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ తరుణంలో అతన్ని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.