Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నామినేషన్ల దాఖలు కంటే ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.