Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఒడిశా
పారాదీప్ తీరంలో ఓ అనుమానిత గూఢచార పావురం కలకలం సృష్టిస్తోంది. జగత్సింగ్పూర్ జిల్లాలో ఓ పావురానికి కెమెరా, మైక్రోచిప్ అమర్చి ఉండటాన్ని అక్కడి స్థానికులు గమనించారు. దీన్ని ఓ చేపలు పట్టే పడవలో పట్టుబడింది. ఈ పావురాన్ని గూఢచర్యానికి ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కొందరు మత్స్యకారులు తమ పడవపై పావురం ఉన్నట్లు గుర్తించారు.
బుధవారం పారాదీప్‌లో పావురం పట్టుకుని మెరైన్ పోలీసులకు అప్పగించారు. అక్కడి అధికారులు పావురం కాలుకు అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు ఒడిశా రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపారు. పావురం కెమెరా, మైక్రోచిప్ కలిగి ఉన్నట్లు తెలుస్తోందని జగత్సింగ్పూర్ ఎస్పీ రాహుల్ పీఆర్ తెలిపారు. తెలియన భాషలో పావురం రెక్కలపై ఏదో భాషలో అక్షరాలు ఉన్నాయని, ఏం రాశారో తెలుసుకోవడానికి నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.