Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలోని మెడికల్, బీడీఎస్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2023 ప్రవేశ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 7వ తేదీన నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలో మొత్తం 21 జిల్లా కేంద్రాల్లో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గత ఏడాది 24 జిల్లా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఏడాది కుమ్రం భీం ఆసిఫాబాద్, వికారాబాద్, మెదక్ జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించట్లేదు. ఈ జిల్లాలకు చెందిన విద్యార్థులు తమ సమీప జిల్లా కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు.