Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నవీన్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన స్నేహితుడినే అతికిరాతకంగా చంపిన ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీసుల కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. ఈ కేసులో అతడి స్టేట్ మెంట్ రికార్డును అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కోర్టు ముందు ఉంచారు. వారం రోజుల పాటు హరిహరకృష్ణను విచారించిన పోలీసులు.. కీలక విషయాలను రాబట్టారు. నిహారికను ఇబ్బంది పెడుతుండంటంతోనే నవీన్ ను చంపాలని నిర్ణయించుకున్నట్లు అతడు ఒప్పుకున్నాడు. అందుకోసం రెండు నెలల క్రితమే డీమార్ట్ లో కత్తి, మెడికల్ షాప్ లో ప్లాస్టిక్ గ్లాస్ కొన్నానని చెప్పాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో నవీన్ నాకు పరిచయం అయ్యాడు. అతడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, నేను అరోరా ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాం. నీహారిక, నవీన్ ప్రేమించుకునే వారు. అయితే నవీన్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడని.. నీహారిక గొడవ పడి అతనితో మాట్లాడటం మానేసింది. నీహారిక అంటే నాకు చాలా ఇష్టం.. అందుకే ఆమెతో చనువుగా ఉండే వాడిని. నవీన్ తో విడిపోయిందని తెలిసి 9 నెలల క్రితం నేను ప్రేమిస్తున్నానని నీహారికకు చెప్పాను. ఆమె ఒప్పుకుంది. అప్పటి నుండి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. నీహారికకు నవీన్ కాల్ చేసి, మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. దీంతో నవీన్‌ను చంపాలని డిసైడ్ అయ్యాను' అని హరిహరకృష్ణ చెప్పాడు.
రెండు నెలల కిందట.. మలక్ పేట డీ మార్ట్ లో 200 రూపాయలకు ఒక కత్తి కొన్నాను. మర్డర్ టైంలో నా ఫింగర్ ప్రింట్స్ పడకుండా.. మెడికల్ షాప్ లో రెండు జతల ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నాను. అవి ఎవరికీ కనపడకుండా... నా బ్యాగ్ లో పెట్టి.. మా ఇంట్లో దాచాను' అని వివరించాడు.
ఫిబ్రవరి 16వ తేదీన నవీన్ ని మర్డర్ చేయాలని అనుకున్నానని.. కానీ కుదరకపోవడంతో 17న హైదరాబాద్ కు పిలిపించి హత్య చేసినట్టుగా హరిహరకృష్ణ తెలిపాడు. పెద్ద అంబర్‌పేట్‌లో మద్యం తాగి నవీన్ ను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతునొక్కి చంపేశానని వివరించారు. తర్వాత కత్తితో తల, మొండెం వేరు చేశానని వెల్లడించాడు. కోపంతో చాతి భాగం నుంచి పొట్ట భాగం వరకు కోసేశానని, గుండెను శరీరం నుంచి వేరు చేశానని చెప్పుకొచ్చాడు. అక్కడి నుంచి హాసన్ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని అతనికి జరిగదంతా చెప్పానని తెలిపాడు. మరుసటిరోజు మర్డర్ గురించి నిహారికకు చెప్పానని హరిహరకృష్ణ చెప్పాడు.
హత్య చేసిన తర్వాత భయంతో విజయవాడ, ఖమ్మం, వైజాగ్ లో తిరిగానని, 24న పోలీసులు ముందు లొంగిపోయానని వెల్లడించాడు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా హరిహర కృష్ణ, ఏ2 నిందితుడిగా హాసన్, ఏ3 నిందితురాలిగా నిహరిక పేర్లను పోలీసులు చేర్చారు.
నిహారిక కన్ఫెషన్ స్టేట్మెంట్..
ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ నేను ప్రేమించుకున్నాం. నవీన్ నేను చాలాసార్లు మా ఇంట్లో కలుసుకునేవాళ్లం. నవీన్ నేను గొడవ పడితే హరిహరకృష్ణ మాకు సర్ది చెప్పేవాడు. నవీన్ తో నాకు గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని. నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నవీన్ నాతో మాట్లాడానికి యత్నిస్తున్నాడని హరికి చెప్పా. నవీన్ కోపంతో రగిలిపోయేవాడు. కానీ, నేను అది సరదానేమో అనుకున్నా ఒక్కోసారి.. నవీన్‌ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని అనేవాడు. నేను తిడితే.. అదీ జోక్ అనేవాడు. ఒకరోజు వాళ్ల ఇంటికి తీసుకెళ్లి.. ఒక బ్యాగులో గ్లౌజులు, కత్తి చూపించాడు. నవీన్‌ను చంపేందుకే ఇవి అన్నాడు. అది నేను నమ్మలేదు. అలా మాట్లాడొద్దని తిట్టా. నవీన్‌తో మాట్లాడడం మానేశానని, ఇక అతను నన్ను మరిచిపోతాడని, మనం సంతోషంగా ఉందామని హరికి చెప్పా.
హత్యకు రెండు రోజుల ముందు నుంచి ఇంటర్ ఫ్రెండ్స్ కలుస్తున్నట్లు హరి నాకు చెప్పాడు. నవీన్ గనుక ఈసారి కాల్ చేస్తే.. వేరే వాళ్లతో రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆరోజు హరి ఫోన్ నుంచే నవీన్ ఫోన్ చేశాడు. నేను హరి చెప్పినట్లే చెప్పా. ఎందుకు అలా చేస్తున్నావ్ అని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశాను. కొద్దిసేపటి తర్వాత హరి నాకు ఫోన్ చేశాడు. నవీన్ ఇంక నీతో మాట్లాడడంట అని చెప్పాడు. నేను సరే అన్నాడు. ఆ ఉదయం హరి నన్ను కలవాలని మేసేజ్ చేశాడు. పాత బట్టలతో వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీదకు వచ్చాడు. ఆ అవతారం చూసి ఏంటని అడిగా. అప్పుడు నవీన్‌ను చంపిన విషయం చెప్పాడు. ఆ తర్వాత వరంగల్ వెళ్లేందుకు డబ్బులు కావాలంటే.. మనీ ఇచ్చా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని డిసైడ్ అయ్యా.
ఫిబ్రవరి 20వ తేదీ రోజున నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా .. హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్ స్టాప్ లో కలిసాడు. నవీన్‌ను చంపిన ప్రాంతాలను తిప్పి చూపించాడు. ఈలోపు నవీన్ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఆరాలు తీశారు. నాకు తెలియది చెప్పా. ఆ తర్వాత హరి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీన ఫోన్ చేశాడు. ఆ తర్వాత హసన్ ఫోన్ చేసి హరి మిస్సయినాడని, వాళ్ళ అక్కాబావ మలక్ పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పాడు. ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చెయమని సూచించాడు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హసన్ మరో ఎవరికీ ఫోన్ చేయొద్దని చెప్పించాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేను, నా ఫ్రెండ్ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్‌లో హరిని చూశాం. అక్కడ చాలాసేపు మాట్లాడి.. నేను పోలీసులకు లొంగిపోతాను అని చెప్పాడు. ఆపై విడిభాగాలను చంపిన స్థలంలోనే వేయమని హసన్, హరికి సూచించాడట. ఆ పని చేశాక.. బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చాడు. నాకు ఫోన్ చేసి.. మా ఇంటికి వచ్చాడు. మా ఇంట్లో హరి స్నానం చేసినాడు. మా బావ అడ్వకేట్. ఆయనతో మాట్లాడాలని.. హరి చెప్పగా, అప్పుడు నేను మా బావ భూపాల్ రెడ్డిని పిలిచి నవీన్ మర్డర్ గురించి చెప్పాం. ఇది పెద్ద కేసు వెంటనే పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలని చెప్పాడు. ఆపై హరి అదే రోజున వెళ్లి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
పోలీసులకు, నవీన్ ఫ్రెండ్స్‌కు కావాలనే హత్య గురించి చెప్పలేదు. ఈ కేసులో దొరికే అవకాశమే లేదని హరి నాతో చెప్పాడు. హరిహరకృష్ణ చెప్పిన మాటల్ని నమ్మాను అని నిహారిక పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చింది.