Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచిలలో ఖాళీగా ఉన్న 114 పోస్టుల భర్తీకి ఐడీబీఐ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి కిందటి నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత మొత్తం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మరో మూడు రోజుల్లో.. అంటే ఈ నెల 12 తో దరఖాస్తు గడువు ముగియనుంది.
ఖాళీల వివరాలు..
మేనేజర్: 75 పోస్టులు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 29 పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్: 10 పోస్టులు
పే స్కేల్:
డిప్యూటీ జీఎం: గ్రేడ్ 'డి' రూ.76010-2220 (4) - 84890-2500 (2) -89890 (7 సంవత్సరాలు)
ఏజీఎం: గ్రేడ్ 'సి' రూ.63840-1990(5) - 73790-2220(2) - 78230 (8 సంవత్సరాలు)
మేనేజర్: గ్రేడ్ 'బి' రూ.48170-1740(1) - 49910-1990(10) - 69810 (12 సంవత్సరాలు)
దరఖాస్తు, ఫీజు, ఎంపిక విధానం:
ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 ఫీజుగా చెల్లించాలి. వయస్సు, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ప్రాథమిక స్క్రీనింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.