Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. కనిపించిన ప్రతి మనిషిపై దాడులకు దిగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై వీధి కుక్కలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో చిన్నారిపై వీధి కుక్క ల దాడి చేశాయి. ఈ దాడిలో జహీదా అనే పాప కు తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం చిన్నారిని హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు.