Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన ఎమ్మెల్సీ ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కారణంగా నేరుగా మిమ్మల్ని కలవలేక పోతున్నానని.. ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడే హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 75 అసెంబ్లీ సీట్లు వస్తాయని తెలిపారు. మరోవైపు ఈరోజు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే సభ విజయవంతం కోసం నేతలందరూ సిద్ధమయ్యారు. కరీంనగర్ సభకు రేవంత్ రెడ్డి తో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థాక్రె, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సహా రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.