Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన జగన్ (కాకూరి పండన్న) తల్లి సీతమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకున్న పోలీసు అధికారులు గత నెల ఆమె ఇంటికి వెళ్లి వైద్య చికిత్సకు సాయం అందించారు. వయసు కూడా ఎక్కువ కావడంతో ఆమె నెల తిరగకుండానే కన్నుమూశారు. జగన్ స్వగ్రామం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీలోని కొమ్ములవాడ గ్రామం. జగన్ ఉద్యమంలోకి వెళ్లినప్పటి నుంచి సీతమ్మ స్వగ్రామంలోనే ఉంటున్నారు. గత నెలలో ఆమె చికిత్స కోసం పోలీసులు సాయం అందించారు. తన తల్లి అంత్యక్రియలకు జగన్ హాజరవుతాడేమోనని పోలీసులు నిఘా పెంచారు.