Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
జిల్లాలోని పెదకాకాని మండలం గడ్డిపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవ వధువు నవ్య అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త మహేష్.. నవ్యపై దాడిచేసి చంపేశాడని కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం నవ్యకు మహేష్‌తో వివాహం జరిగింది. కాళ్ల పారాణి ఆరకముందే తమ బిడ్డను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని జీజీహెచ్ వద్ద మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. భర్తే హత్య చేశాడా? లేక కుటుంబ కహాల నేపథ్యంలో ప్రాణం తీసుకుందా?, పెళ్లై నాలుగు నెలలు గడవముందే ఈ ఘోరమైన ఘటన ఎలా జరిగివుండొచ్చు? ఏమైనా అక్రమ సంబంధాల వ్యవహారం ఉందా? అలాగే అత్తింటి వేధింపులే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.