Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్వారావుపేటకు ఇరువైపులా రోడ్లు విస్తరణ...
- రూ.23.50 కోట్లుకు పరిపాలనా అనుమతి...
నవతెలంగాణ - అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట కొత్త సొబగులు అద్దుకోనుంది.ఈ పట్టణ పౌరసమాజం ఎన్నో ఏళ్ళ కల సెంట్రల్ లైటింగ్ ప్రస్తుతం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషితో నెరవేరనుంది.గత రెండు రోజులుగా హైద్రాబాద్ లో మకాం వేసిన ఎమ్మెల్యే మౄచ్చా నియోజక వర్గం అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో పలువురు మంత్రులతో భేటీ అవుతున్నారు.ఈ క్రమంలో అశ్వారావుపేట - భూర్గంపాహాడ్ రోడ్ లో స్థానిక పోలీస్ స్టేషన్ కూడలి నుండి ఒకటిన్నర కిలోమీటర్,మూడు రోడ్ల కూడలి నుండి సత్తుపల్లి రోడ్ లో రెండు కిలో మీటర్ లు మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు డి.ఎం.ఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (ట్రస్ట్) నిధుల నుండి రూ.23 కోట్ల 50 లక్షల వ్యయం కోసం పరిపాలనా అనుమతులు కోసం జీఓ విడుదల చేసారు. ఈ నిధులతో నాలుగు లైన్ ల రోడ్ విస్తరణ,డివైడర్ నిర్మాణం,విద్యుదీకరణ,ఇరువైపులా మురికి కాలువల నిర్మాణం,పాదచారుల కోసం పాత్ వే నిర్మిస్తామని ఆర్ అండ్ బి డీ.ఈ శ్రీనివాస్ తెలిపారు.ప్రాధమిక ప్రతిపాదనలు మేరకు ఈ నిధులు వ్యయానికి అనుమతి ఇచ్చారని ప్రతిపాదనలు పునః సమీక్ష అనంతరం ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు.