Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ ఆర్టీసీ మరో కొత్త పథకం తీసుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. టీ-6, ఎఫ్-24 టికెట్ల పేరిట కొత్త ఆఫర్లను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. ఈ టికెట్లకు సంబంధించిన పోస్టర్లను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టీ-6 టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 50 చెల్లించి టీ-6 టికెట్ కొనుగోలు చేస్తే.. ఆరు గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. 300 చెల్లించి ఎఫ్-24 టికెట్ కొనుగోలు చేస్తే.. ఆ టికెట్‌పై నలుగురు వ్యక్తులు రోజంతా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఈ రెండు టికెట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.