Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఏడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ లీగ్‌లో వరుసగా రెండు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ డీవై పాటిల్ స్టేడియంలో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి రెండు మ్యాచుల్లో రెండొందలు కొట్టిన ఆ జట్టు బలమైన ముంబైపై భారీ స్కోర్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండు మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ సేన ఢిల్లీని నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. ఈ మ్యాచ్‌లో లానింగ్, షఫాలీ మరోసారి రాణిస్తే ఆ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయం. ముంబై ఓపెనర్ హేలీ మాథ్యూస్ భీకర ఫామ్‌లో ఉంది. ఆమెతో పాటు హర్మన్‌ప్రీత్, అమేలియా కేర్ చెలరేగితే ముంబైని అడ్డుకోవడం ఢిల్లీకి కష్టమే.